రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవీకాలం పొడగింపు

రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూపాల్‌రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన పదవీకాలం పొడగింపుపై లోక భూపాల్‌రెడ్డి స్పందించారు. పదవీకాలం పెంచడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సమయంలో తాను, తన కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన అన్నారు.  పదవీకాలాన్ని పెంచినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు.